బాబు కళ్లలో ఆనందం కోసమా ‘కరువు’ రాతలు? | Sakshi
Sakshi News home page

బాబు కళ్లలో ఆనందం కోసమా ‘కరువు’ రాతలు?

Published Sat, Nov 18 2023 5:31 AM

Identification of drought according to specified criteria - Sakshi

సాక్షి, అమరావతి: తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం కరువవడంతో రామోజీరావు పిచ్చి రోజురోజుకీ పీక్స్‌కు చేరుకుంటోంది. తన విషపుత్రికలో ఆయన ఏం రాస్తున్నారో కూడా ఆయనకు తెలీనంతగా పిచ్చి ముదురుతోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఆయన ఏడుపు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువును ఈ ప్రభుత్వం ఏదో దాచేస్తున్నట్లుగా గగ్గోలు పెడుతూ రోత రాతలు రాస్తూ పైశాచికానందం పొందుతున్నారు.

‘జగన్‌ కళ్లలో ఆనందంకోసం జనం బతుకుతో ఆటలా?’ అంటూ శుక్రవారం ఈనాడు కక్కిన విషం రామోజీ మానసిక దౌర్బల్యానికి అద్దంపడుతోంది. నిజానికి.. కరువును ఎలా అంచనా వేస్తారు. ఏ ప్రమాణాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటిస్తారు అన్నది ఈనాడు రామోజీకి తెలియంది కాదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీస్తూ రోజూ ప్రభుత్వ వ్యతిరేక రాతలతోనైనా చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలన్నది ఆయన ఉద్దేశ్యం. అసత్యాలతో కూడిన ఈనాడు తాజా కథనంపై ఈరోజు ‘ఫ్యాక్ట్‌చెక్‌’ వివరాలివీ..

ఈనాడు ఆరోపణ : కరువును దాచేస్తున్నారు..
వాస్తవం: ఒక ప్రాంతంలో కరువు ఉందా? లేదా? అని నిర్ధారించడానికి అనుసరించే ప్రమాణాలు ఏ ప్రభుత్వానికైనా ఒకేలా ఉంటాయి. వాతావరణ శాఖ విడుదల చేసే వర్షపాతం, పంటల విస్తీర్ణం, భూమిలో తేమశాతం, నీటివనరులు, వృక్ష జాతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కరువు మండలాలను నిర్ధారిస్తారు. ఇందులో దాపరికం ఏమీ ఉండదు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా 80 మండలాల్లో తీవ్ర కరువు, 23 మండలాల్లో మోస్తరు కరువు ఉన్నట్లుగా ప్రభుత్వం సీజన్‌ ముగియకుండానే నిర్ధారించింది. 

ఈనాడు ఆరోపణ : కేంద్రానికి కరువు నివేదిక సమర్పించలేదు..
వాస్తవం: కరువు సాయం కోసం పూర్తి వివరాలతో కూడిన నివేదికను నవంబరు 14నే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. కరువు బాధిత ప్రాంతాల్లో సత్వరమే తీసుకోవాల్సిన చర్యల కోసం రూ.688 కోట్ల సహాయం చేయాలని అర్థించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పశుగ్రాసం, తాగునీరు అందించడానికి సహాయం చేయాలని కోరింది. 

ఈనాడు ఆరోపణ : సీఎం పట్టించుకున్న దాఖలాలేవి?..
వాస్తవం: ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు వరకు ప్రతీనెలా సీఎం జగన్‌ అధికారులతో సమీక్షిసూ్తనే ఉన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి అంశాలపైనా వాకబు చేసూ్తనే అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేసూ్తనే ఉన్నారు. 

ఈనాడు ఆరోపణ : కరువు రైతులకు భరోసా ఏది?
వాస్తవం: వర్షాభావ పరిస్థితులను ముందుగానే గుర్తించిన ప్రభుత్వం శాస్త్రవేత్తల సూచనలతో ప్రత్యామ్నాయ పంటల  ప్రణాళిక అనుగుణంగా ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, కొర్ర, జొన్న, మొక్కజొన్న, ప్రొద్దు తిరుగుడుతో పాటుæ తక్కువ పంటకాల వరి రకాలను 80 శాతం సబ్సిడీతో (రూ.25.66 కోట్ల విలువ గల) 29 వేల క్వింటాళ్ల విత్తనాలను 1.13 లక్షల మంది రైతులకు అందజేసింది. అలాగే,  ముందస్తు రబీలో శనగ పంటను వేయగలిగిన ప్రాంతాలలో 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. కరువు మండలాల్లో 75 శాతం సబ్సిడీపై ఇప్పటికే 23,652 క్వింటాళ్ల పశుగ్రాసం విత్తనాలు, 13,442 మెట్రిక్‌ టన్నుల దాణాను పంపిణీ చేసింది. 40 శాతం సబ్సిడీపై కత్తిరించే యంత్రాలిచ్చారు.

నేడు సీజన్‌ ముగియకుండానే పరిహారం..
కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరుసటి సీజన్‌లోగా పంట నష్ట పరిహారాన్ని అందిస్తోంది. ఇలా ఈ నాలుగున్నరేళ్లలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో సహా మొత్తం రూ.1,977 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందించింది. అంతేకాదు.. కరువు ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలూ చేపట్టింది.

పంటకోత ప్రయోగాలు పారదర్శకంగా చేయాలని, నష్టపోయిన ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేలా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీచేశారు. నివేదికలు రాగానే బెట్ట పరిస్థితులతో దిగుబడి నష్టం జరిగిన నోటిఫైడ్‌ పంటలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా  పరిహారం, దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. కానీ, ఈనాడుకు మాత్రం ఇవేమీ కన్పించవు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఎంత నష్టం చేసినా ఏ రోజు ప్రశ్నించని రామోజీ ఇవాళ కరువును దాచేస్తున్నారంటూ ప్రభుత్వంపై బురద జల్లడం విస్మయానికి గురిచేస్తోంది. 

ఏనాడైనా బాబు ఆదుకున్నారా? 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా కరువు కాటకాలే. కానీ,  సకాలంలో కరువు మండలాలను ప్రకటించకపోయినా, కరువు పరిహారం ఇవ్వకపోయినా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టినా ఏ ఒక్కరోజైనా రైతుల తరఫున అప్పట్లో ప్రశ్నించారా? అలాగే..
2014 ఖరీఫ్‌లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకూ మూడు దఫాల్లో కరువు మండలాలను ప్రకటించారు. 
2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకూ ప్రకటించనే లేదు. 
   2016 ఖరీఫ్‌లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకూ ప్రకటిసూ్తనే ఉన్నారు. 
 ఇక 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకూ కరువు మండల ప్రకటన చేయలేదు. 
 2018 ఖరీఫ్‌లోనూ కరువు వస్తే విడతల వారీగా ప్రకటన చేసూ్తనే ఉన్నారు. 
 ఆ తర్వాత ఎన్నికలకు ముందు మాత్రమే 2018 రబీ నాటి కరువుకు సంబంధించి ఒకే దఫాలో ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు. 

అప్పట్లో ఏనాడైనా సకాలంలో సాయం చేశారా?
రైతులకు అందించాల్సిన సహాయం చూస్తే.. గత ప్రభుత్వంలో ఇచ్చింది అరకొరే అయినా ఏనాడు అది సకాలంలో అందించలేదు. ఉదా..
♦ 2014లో ఖరీఫ్‌ కరువు సాయం 2015 నవంబరు వరకు చేయలేదు. 
♦ 2015 కరువు సాయం 2016 నవంబరులో ఇచ్చారు. 
♦ 2016లో కూడా కరువు వస్తే 2017 జూన్‌లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో అందించారు. 
♦ ఇక 2018లో కరువువల్ల ఖరీఫ్‌లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంట నష్ట జరిగితే బాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 

Advertisement
 
Advertisement
 
Advertisement