
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులను దేశ బహిష్కరణ చేయాలన్నారు.
కాగా, మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విడిచి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి టీడీపీలో అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పడం దారుణం. శాంతి భద్రతలు అతిక్రమించిన చంద్రబాబు, లోకేష్‌లను ముందు అరెస్ట్ చెయ్యాలి. సెప్టెంబర్ ఒకటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం లాకొన్న రోజు.. అది ఒక బ్లాక్ డే. 1994లో ఎన్టీఆర్‌ను చూసి 200 సీట్లు ప్రజలు ఇచ్చారు కానీ.. చంద్రబాబును చూసి కాదు’ అని వ్యాఖ్యానించారు.