గుండెపోటు బాధితులకు గోల్డెన్‌ చికిత్స

Golden treatment for heart attack victims in Andhra Pradesh - Sakshi

స్టెమీ ఇండియాతో వైద్య శాఖ ఒప్పందం 

టెలీమెడిసిన్‌ తరహాలో హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో అమలు 

వెద్యులు, సిబ్బందికి స్టెమీ ప్రొటోకాల్స్‌పై శిక్షణ 

స్టెమీ కార్యక్రమం కోసం క్యాథ్‌ల్యాబ్‌ ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రులు హబ్‌లుగా అభివృద్ధి 

ఇవిలేని చోట వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గుండెపోటు బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందించడం కోసం ఉద్దేశించిన ఎస్టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ (స్టెమీ) కార్యక్రమం అమలులోకి తీసుకుని రావడంలో భాగంగా స్టెమీ ఇ డియా సంస్థతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. టెలీ మెడిసిన్‌ తరహాలో హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు.

ఈ క్రమంలో హబ్, స్పోక్‌లోని వైద్యులు, సిబ్బందికి స్టెమీ ప్రొటోకాల్స్‌పై స్టెమీ ఇండియా శిక్షణ ఇవ్వనుంది. స్టెమీ అంటే సాధారణ భాషలో గుండె రక్తనాళం 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో రెండు, మూడు గంటల్లో లక్షణాలను గుర్తించి, ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌)ను ఇవ్వగలిగితే ప్రాణాలను   కాపాడొచ్చు.  

క్యాథ్‌ల్యాబ్‌ ఉన్న ఆస్పత్రులు హబ్‌లుగా అభివృద్ధి 
స్టెమీ కార్యక్ర­మం కోసం క్యా­థ్‌ల్యాబ్‌ ఉన్న ప్ర­­భుత్వ బోధనాస్పత్రు­­లను హబ్‌లుగా అభి­వృ­ద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రా­ష్ట్రంలో ఆరు బోధనాస్పత్రుల్లో క్యా­థ్‌ల్యాబ్‌ సౌకర్యం ఉంది. మిగిలిన ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యాన్ని ప్రభు­త్వం సమకూర్చడానికి చర్యలు చేపట్టింది. ఈలో­గా క్యాథ్‌ల్యాబ్‌ రహిత బోధనాస్పత్రులున్న చోట ఆ సౌ­కర్యం ఉన్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ప్రై­వే­ట్‌ ఆస్పత్రుల సేవలు వినియోగించుకోనున్నారు.

జిల్లా ఆస్పత్రు­లు, 53 ఏరియా ఆస్పత్రులు స్పోక్‌లుగా వ్యవహరిస్తాయి. ఈ క్రమంలో హబ్‌కు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రులను అనుసంధానిస్తారు. ఈ ఆస్పత్రులకు ఛాతీనొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళ్తుంది.

ఫలితాన్ని పరిశీలించి, గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్‌ అవసరమా? లేదా? అనేది కార్డియాలజిస్ట్‌ నిర్ధారిస్తారు. అనంతరం స్పోక్‌ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేస్తారు. అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్‌’ ఇంజక్షన్‌ ఇస్తారు.  దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం చికిత్స కోసం హబ్‌కు/సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు.  

త్వరలో వైద్యులు, సిబ్బందికి శిక్షణ 
స్టెమీ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో వైద్యులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్, సిబ్బంది, స్పోక్‌లోని జనరల్‌ ఫిజీషియన్‌ ఇతర సిబ్బంది విధులు, కర్తవ్యాలు, స్టెమీ ప్రొటోకాల్స్‌పై శిక్షణ ఉంటుంది. అదే విధంగా స్పోక్స్‌కు స్టెమీ కిట్‌ల పంపిణీ చేపడతాం. వీలైనంత త్వరగా స్టెమీ కార్యక్రమం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 
– డాక్టర్‌ వినోద్‌కుమార్, డీఎంఈ, కమిషనర్‌ ఏపీవీవీపీ      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top