వీస్కీ టేస్ట్‌ వెనుక ఏముందంటే?

Environmental Conditions Impact Flavor Of Whiskey, Study Finds - Sakshi

ఓరేగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనం

విస్కీ బ్రాండ్‌లు పలురకాలు. వాటిలో ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఇష్టం. ఎందుకంటే వాటి ఫ్లేవర్లు దానికి కారణం. అసలు విస్కీకి ఫ్లేవర్‌ ఎలా వస్తుంది. దానిని గుర్తించడానికి ఓరేగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన డస్టిన్‌ హెర్బ్‌ నేతృత్వంలోని బృందం పలు అధ్యయనాలు చేసింది. వాటిల్లో తెలిసిందేమిటంటే.. విస్కీని తయారు చేయడానికి ఉపయోగించే బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లేవర్‌ మార్పులు సంభవిస్తాయని. ఈ కారణంగానే వైన్‌లాగా విస్కీలో కూడా రుచులు మారతాయని. అయితే విస్కీ రుచుల్లో తేడా కనుగొనడానికి వాతావరణ పరిస్థితులపై చేసిన ఈ అధ్యయనమే తొలిదని చెబుతున్నారు. ఈ విషయంపై డస్టిన్‌ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చాలా పెద్ద పరిశోధన అవసరం. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే అంకిత భావం కూడా అవసరం. బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విస్కీ రుచుల్లో తేడా వస్తుందని మా పరిశోధనల్లో తేలింది’’ అని చెప్పారు.  

ఎలా కనుగొన్నారు.? 
పరిశోధన బృందం ముందు బీర్లు తయారీకి ఉపయోగించే బార్లీ, వాటి ఫ్లేవర్లపై పరిశోధనలు చేశారు. బార్లీలో రకాలను బట్టి బీర్ల ఫ్లేవర్లలో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఇదే సూత్రం విస్కీకి కూడా వర్తిస్తుందా అనే కోణంలో ఆలోచించారు. దీంతో ఐర్లాండ్‌లోని రెండు కమర్షియల్‌ బార్లీ వెరైటీలైన ఒలంపస్, లారియేట్‌లపై పరిశోధనలు ప్రారంభించారు. బన్‌క్లోడీ అనే తీర ప్రాంతంలో పండించే ఒక వెరైటీని, అతీ అనే మైదాన ప్రాంతంలో పండించే మరో వెరైటీని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయి. అలాగే మట్టిలో కూడా తేడా స్పష్టంగా ఉంటుంది.

ఒక క్రమ పద్ధతిలో వీటిని మాల్ట్‌లా మార్చారు. బార్లీ మాల్ట్‌ డిస్టిల్డ్‌ అయిన తర్వాత దానిని ‘న్యూ మేక్‌ స్పిరిట్‌’ అంటారు. ఈ స్పిరిట్‌ను మూడేళ్లు చెక్క పీపాలో ఉంచాక అది విస్కీగా మారుతుంది. వివిధ పరిశోధనల ద్వారా స్పిరిట్‌లోని ఫ్లేవర్లును వర్గీకరించారు. బార్లీ పండించిన ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు విస్కీ అరోమాకు కారణంగా గుర్తించారు. అతీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి తీయని, పుల్లని, తృణ ధాన్యాల వాసనతో కూడిన అరోమా రాగా, బన్‌క్లోడీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి ఎండు ఫలాల వాసనతో కూడిన అరోమా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.  

విస్కీని వాసన చూసి ప్లేవర్లు చెప్పే నిపుణుల ప్రకారం సాధారణ ఫ్లేవర్లు ఇవీ
 వైనీ, ఫీన్‌టీ, సల్ఫరి, వుడీ, సిరియల్, ఫ్రూటీ ఫ్లోరల్, పీటీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top