
ప్రజలపై రూ.31,886 కోట్ల భారం
కరెంటు బిల్లులు చూసి బెంబేలు
వినియోగం నియంత్రణకు యత్నం
భారీగా పడిపోతున్న వాడకం
కూటమి పాలనలో చార్జీల పెంపు ఫలితం
ప్రజల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం
నిరుటి కంటే 20 మి.యూ. వరకు తక్కువ డిమాండ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరం సరఫరా. అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్ర విద్యుత్ సంస్థలు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వినియోగదారుల సంక్షేమానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం అత్యంత కీలకమనే భావన. రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు.
కూటమి సర్కారులో..
విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపేందుకు అన్ని విధాలా ప్రయత్నం. ఫలితంగా విద్యుత్ వాడాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఏకంగా 20 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ తగ్గిపోయింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల కిందట విద్యుత్ వినియోగదారుల సంఖ్య 1.45 కోట్లు. మూడేళ్ల క్రితం ఈ సంఖ్య 1.92 కోట్లకు పెరిగింది. కోతలు లేకుండా సరఫరా అందించడంతో పాటు వివిధ వర్గాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీలు కల్పించింది. చార్జీల భారం వేయకుండా ఊరటనిచి్చంది.
దీంతో సర్వీసులు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మారుమూల పల్లెలకు సైతం లైన్లు వేయడంతో ఇదివరకు బిల్లులకు భయపడి వెలుగులకు నోచుకోని వారి ఇంట కూడా విద్యుత్ కాంతులు ప్రకాశించాయి. ఇది రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, విద్యుత్ రంగ ప్రగతికి సూచిక అని నిపుణులు అభివర్ణించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులు అవుతోంది.
⇒ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల కరెంట్ చార్జీల భారాన్ని ప్రజలపై వేసి బాదుడికి శ్రీకారం చుట్టింది. మరో రూ.3,629.36 కోట్ల చార్జీల మోతకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించింది. అంటే, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది.
⇒ తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కమిషన్‌ను కోరా>యి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ప్రజలపై మొత్తంగా రూ.31,886.68 కోట్ల చార్జీల భారం వేసినట్లవుతుంది.
⇒ భారీ విద్యుత్ భారాన్ని చూసి బెంబేలెత్తిపోతున్న ప్రజలు వినియోగం తగ్గించేస్తున్నారు. కాగా,సూక్ష్మ, చిన్న మధ్య తరహా, కుటీర పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, గృహాల్లో విద్యుత్ వాడకం తగ్గడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక
నిపుణులు హెచ్చరిస్తున్నారు.