సర్కారుకు స్థానిక సచివాలయ ఉద్యోగుల డెడ్‌లైన్‌ | AP Village and Ward Secretariat JAC warns the government | Sakshi
Sakshi News home page

సర్కారుకు స్థానిక సచివాలయ ఉద్యోగుల డెడ్‌లైన్‌

Sep 22 2025 5:21 AM | Updated on Sep 22 2025 5:21 AM

AP Village and Ward Secretariat JAC warns the government

రౌండ్‌టేబుల్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వార్డు/గ్రామ సచివాలయాల జేఏసీ ప్రతినిధులు

ఈ నెల 27 నాటికి చర్చలకు పిలవాల్సిందే 

లేదంటే పింఛన్లు పంపిణీ చేయం 

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ జేఏసీ హెచ్చరిక

పెనమలూరు: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని.. లేదంటే అక్టోబర్‌ 1న పింఛన్లు పంపిణీ చేసేది లేదని హెచ్చరించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జేఏసీ రౌండ్‌టే­బు­ల్‌ సమావేశం జరిగింది. అనంతరం సంఘ నాయ­కులు మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ/­వార్డు సచివాలయాలకు చెందిన 19 శాఖల సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 

సెప్టెంబర్  27నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో పింఛన్ల పంపిణీని బహి­ష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22న సెర్ప్‌ సీఈఓకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నుంచి నోటీసులు ఇస్తామన్నారు. సమ­స్యలు పరిష్కరించకపోతే విధుల్లో సహకరించబోమన్నారు. 23, 24, 25 తేదీల్లో కలెక్టర్‌లకు, జాయింట్‌ కలెక్టర్లకు, శాఖాధిపతులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. 26, 27 తేదీల్లో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రూపుల నుంచి సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా వైదొలుగు­తామని అధికారులకు స్ప­ష్టం చేస్తామన్నారు. 

28న కర్నూలులో ప్రాంతీయ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ రూ­పొందిస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాల­యా­­ల సిబ్బందికి 9 నెలలుగా రావాల్సిన ఎరియర్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమేటివ్‌ అడ్వా­న్స్‌ స్కీమ్, డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్థి­కేతర అంశాలు, ఉద్యోగులకు నిర్దిష్ట­మెన సర్వీ­స్‌ రూల్స్, తరచుగా నిర్వహించే సర్వేలు,  అసంబద్ధమైన హేతుబద్దీకరణ, అంతర్‌ జిల్లాల బదిలీలు వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశా­రు. సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్‌ చైర్మన్‌ పిల్లి హరీష్, కన్వినర్‌ పులిబండ్ల నరసింహారావు తదితరులు పా­ల్గొ­­న్నా­రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement