సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దు | Sakshi
Sakshi News home page

సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దు

Published Mon, May 27 2024 3:54 AM

AP CEO Mukesh Kumar Meena orders on postal ballot counting

డిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి 

అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండి

డిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి 

డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు 

బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు 

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు

సాక్షి, అమరావతి: డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ స్టాంప్‌ (సీల్‌) లేదన్న ఏకైక కారణంతో పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జూన్‌ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపులో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంచేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ ­కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్ని­కల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంతమంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి పలు విజ్ఞాపనలు వచ్చా­యి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న మీనా జూలై 19, 2023లో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలను ఉటంకిస్తూ తాజా­గా ఉత్తర్వులను జారీచేశారు. దీని ప్రకారం.. 

⇒ డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని, ఇవి ఉండి స్టాంప్‌ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. 
⇒ ఒకవేళ అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం మీద అనుమానమొస్తే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఏర్పాటుచేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్ల వివరాలతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలి. 
⇒ అదే విధంగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ వెనుక రిటర్నింగ్‌ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి.  

⇒ బ్యాలెట్‌ పేపర్‌ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్‌ నెంబర్‌ ప్రకారం కౌంటర్‌ ఫాయిల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్‌ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి. 
⇒ అలాగే, ఓటరు కవర్‌–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్‌ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్‌ పేపర్‌ ఉండే ఇన్నర్‌ కవర్‌ ఫారం–13బీనీ తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు..  

⇒ కవర్‌–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్‌ ఫారం లేకపోతే, డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ లేదా అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్‌ పేపర్‌ తెరవకుండానే తిరస్కరించొచ్చు. ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్‌ పేపరు తెరిచిన తర్వాత ఈ దిగువ పేర్కొన్న సందర్భాల్లో కూడా ఓటును తిరస్కరించొచ్చు. 

⇒ ఎవరికి ఓటు వేయకపోతే.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానా స్పద బ్యాలెట్‌ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్‌ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్‌ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్‌ ఆఫీసరు ఇచ్చిన కవర్‌–బీ లేకపోతే.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరిస్తారు. 
ఈ విషయాలను రాజకీయ పారీ్టలు, కౌంటింగ్‌ ఏజెంట్లకు అవగాహన కలి్పంచేలా రిటర్నింగు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మీనా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement