ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు

AP Cabinet Ministers 2022 Portfolios Complete Detail - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. 

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) 
ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ

దాడిశెట్టి రాజా (రామలింగేశ్వర రావు) : రోడ్లు, భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌
గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్‌ శాఖ, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖ
జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ
కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి :  ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)
ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ
మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ 
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ
పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ
రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ
తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
విడదల రజిని : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు

వీళ్లలో అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌ , సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top