
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
కుప్పం(చిత్తూరు): చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోని మల్లానూరు గ్రామ పంచాయతీకి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ్ వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యే వెంకటే గౌడ, రెస్కో చైర్మన్ సెంథిల్, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుదీర్ తదితరులు పాల్గొన్నారు.