● అధినేతతో భేటీ | - | Sakshi
Sakshi News home page

● అధినేతతో భేటీ

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

బాధ్యతగా పనిచేద్దాం

అనంతపురం టవర్‌క్లాక్‌: ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఉద్యోగులందరూ సమన్వయంతో బాధ్యతగా పని చేద్దామని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి సూచించారు. బుధవారం ఉదయం జెడ్పీ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆమె శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్ళారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ఏఓలు లెక్కల్‌ శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పనితీరు మెరుగుపడాలి

ఐసీడీఎస్‌ అధికారులకు

జేడీ శివజ్యోతి ఆదేశం

అనంతపురం సెంట్రల్‌: పనితీరు మెరుగుపడాలని ఐసీడీఎస్‌ సిబ్బందిని మహిళాశిశు సంక్షేమశాఖ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ శివజ్యోతి ఆదేశించారు. బుధవారం ఆర్డీటీ ఆడిటోరియంలో సూపర్‌వైజర్లు, సీడీపీఓలతో ఆమె సమావేశమై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అవినీతి, అక్రమాలపై తరుచూ ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకు ముందు ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయంలో ఉద్యోగుల గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం శిశుగృహ, బాలసదనం కార్యాలయాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శశికళ, పలువురు సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. ­

Advertisement
 
Advertisement
Advertisement