తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ... | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ...

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

ధర్మవరం అర్బన్‌: స్థానిక జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన రేషం వ్యాపారి పూజారి రాఘవ(35) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్‌ యాత్రకు వెళ్లిన రాఘవ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. నాలుగురోజుల క్రితం రైలు కర్ణాటకకు చేరుకోగానే రాఘవ కనిపించలేదు. రైలు మొత్తం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ధర్మవరానికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని రాయచూర్‌ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న రాఘవ కుటుంబ సభ్యులు రాయచూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.

ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు

తిరుపతి అర్బన్‌: ఏపీఆర్‌జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. వి.మోక్షిత్‌ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్‌ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్‌.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్‌ 14వ ర్యాంకు, బి. హర్షిత్‌ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్‌ కుమార్‌, కే. ధోనీష్‌ 20వ ర్యాంకు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్‌. విశ్వనాథ్‌రెడ్డి, విశ్వం అకడమిక్‌ డైరెక్టర్‌ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్‌ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందించారు.

పోలీసుల అదుపులో కేబుల్‌ దొంగ

అగళి: కేబుల్‌ అపహరించుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అగళి మండలం కదిరేపల్లికి చెందిన రైతు గొల్ల సన్న ఈరప్ప తన వ్యవసాయ బోరు బావిలోని మోటారు కాలిపోవడంతో సోమవారం పైకి లాగి మరమ్మతుకు తీసుకెళ్లాడు. కేబుల్‌ను పొలంలోనే వదిలేశాడు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గురుమూర్తి, తన స్నేహతుడితో కలిసి మంగళవారం ఉదయం కేబుల్‌ను సంచిలో వేసుకుని వెళుతుండగా అనుమానం వచ్చి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో గురుమూర్తి సంచిని అక్కడే పడేసి పారిపోయాడు. సంచిలో 300 మీటర్ల పొడవైన కేబుల్‌ను గుర్తించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైతు ఈరప్ప అక్కడకు చేరుకుని ఆ కేబుల్‌ తనదేనని ధ్రువీకరించాడు. రైతుల ఫిర్యాదుతో బుదవారం గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

టి.శ్రీదర్శిని

(8వ ర్యాంక్‌)

వి.మోక్షిత్‌

(1వ ర్యాంక్‌)

Advertisement
 
Advertisement
Advertisement