ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్న ప్రభుత్వం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

గుత్తి: ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం మానుకోవాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్‌ హితవు పలికారు. గుత్తిలోని పద్మవాణి పాఠశాలలో బుధవారం జరిగిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్‌సీ, మధ్యంతర భృతి, పలు పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఇప్పటికై నా ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేపట్టినా ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడంతో అందరిలోనూ అసహనం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికై నా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు టెట్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, రామాంజనేయులు, సీనియర్‌ నాయకులు కొలంబస్‌, పులికొండ, పెద్దిరెడ్డి, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement