యల్లనూరు: ఉపాధి పనుల్లో పాలుపంచుకునే కూలీల సంఖ్య మరింత పెరగాలని సంబంధిత సిబ్బందిని డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. మండలంలోని శింగవరం గ్రామంలో జలధార, జల హారతి పనులను, యల్లనూరులో అమృత్ సరోవర్ పనులు, మేడికుర్తి గ్రామంలో ఫారంపాండ్ పనులను బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పని ప్రాంతంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం కల్పిలంచాలని సిబ్బందికి సూచించారు. వేసవి అలవెన్సులు అందిస్తామని, వేతనం కూడా పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటామని, పనుల్లో పాల్గొనే వారి సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణసాగర్, ఏపీఓ ఓబిరెడ్డి, ఈసీ సత్యమూర్తి, టీఏలు నరేంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రామాంజనేయులు, రాజకుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
డ్వామా పీడీ సలీంబాషా


