ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో గత 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. బుధవారం తన స్వగ్రామం కొనకొండ్లలో నెలకొన్న తాగునీటి సమస్యపై కలెక్టర్ ఆనంద్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఉరవకొండ, వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. కొన్ని రోజులుగా ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేపడతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారంపై మంత్రి కేశవ్ సైతం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించి తాగునీటి సరఫరాను పునరుద్దరించాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీకు హమీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి


