రాయదుర్గం/ బొమ్మనహాళ్/ గుంతకల్లు రూరల్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా వ్యాసరాయలు కాలంలో ప్రతిష్టించిన డీ హీరేహాళ్ మండలం మురడి, గుంతకల్లు మండలం కసాపురం, బొమ్మనహాళ్ మండలం నేమకల్లులోని ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమా.. మము గనుమా.. అంటూ స్వామివారి దర్శనబాగ్యం కోసం క్యూకట్టారు. హనుమాన్ చాలీసా, పారాయణం, భజన కార్యక్రమాల్లో పాల్గొని పునీతులయ్యారు. అన్నదానం, ప్రసాదాలు పంచిపెట్టారు.
ఘనంగా ప్రారంభోత్సవాలు
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ పరిసరాల్లో నూతనంగా ప్రసాదాల తయారీ శాల, ప్రసాదాల విక్రయకేంద్రం, పరిపాలనా కార్యాలయం, గోశాల, స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించారు. హనుమజ్జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఈ సముదాయాలను ప్రారంభించారు. గర్భాలయం, విమాన గోపురం దాత నవోదయ ఎడుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ సుంకి రాజేందర్‌రెడ్డి దంపతులు, గోశాల దాత పరమేశ్వరి సంగ్ కుటుంబ సభ్యులు తదితరులు హనుమజ్జయంతి వేడుకలతోపాటు, ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
లక్ష పుష్పార్చనలో అనంతపురంలో పంచముఖ
నెట్టికంటుడు ఆంజనేయస్వామి
మురడిలో ప్రత్యేక
పూజలందుకున్న అంజన్న
కసాపురంలో దర్శనానికి బారులుతీరిన భక్తులు అనంతపురంలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తున్న దృశ్యం


