రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

అనంతపురం అర్బన్‌: సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం డెడికేటెడ్‌ కమిషన్‌ ముఖ్య ఉద్దేశమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను శాసీ్త్రయంగా, చట్టబద్ధంగా ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై అధ్యయనం కోసం వచ్చిన చైర్మన్‌ ముందుగా కలెక్టర్‌ ఆనంద్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం బీసీ సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతులకు (బీసీ) కేటాయించాల్సిన శాతాన్ని నిర్ణయించేందుకు జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, బీసీ సంక్షేమాధికారి ఖుష్బూకొఠారి, డీపీఓ నాగరాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement