కరువు చిత్రం | - | Sakshi
Sakshi News home page

కరువు చిత్రం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావుల్లోంచి నీరు పైకి రావడం లేదు. ఎండుతున్న చీనీ తదితర పంటలను చూడలేకపోయిన రైతులు డబ్బు వెచ్చించి ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి పెడుతున్నారు. మరికొంతమంది రైతులు ఆర్థిక ఇబ్బందులతో పంటను రక్షించుకోలేక ఆశలు వదిలేశారు.

దీంతో పలు చోట్ల పంటలు ఎండిపోయాయి. మరోవైపు అటవీ ప్రాంతంలోనూ మేత దొరకడం లేదు. గార్లదిన్నె మండలం కోటంక, మర్తాడు గ్రామాల్లో అయితే గొర్రెలు, మేకలు ఎండిపోయిన పంట పొలాల్లో మేత మేస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా బంధించింది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement