వైభవంగా శయనోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శయనోత్సవం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

రాయదుర్గంటౌన్‌: కోటలో కొలువైన కలియుగ దైవం ప్రసన్న వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. చివరి రోజు ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వారి శయనోత్సవం, సప్తప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అర్చకుల ఆధ్వర్యంలో వేంకటరమణస్వామికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రజలకు, కులసంఘాల వారికి, దాతలకు ఆలయ ఈఓ నరసింహా రెడ్డి, పాలక మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement