ఉరవకొండ: ‘నేస్తమా ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి.. పిల్లలు ఎంతమంది.. ఏం చదువుతున్నారు..’ అంటూ ఆ స్నేహితులు ఆత్మీయ పలకరింపులతో సందడి చేశారు. స్థానిక ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా సాగింది. చదువుకున్న పాఠశాలలో 28 ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు సందడిగా గడిపారు. తమ గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, యాసిన్, బాషా, మార్టిన్, విరుపాక్షి, కృష్నమూర్తి, నారాయణ, నాగరాజు, ప్రమీలా, రాజేశ్వరీ, శివరాజేశ్వరీ, శ్రీపతి, రఫీక్, రాజ్‌గోపాల్, రామాంజినేయులు తదితరులను శాలువలతో సన్మానించారు. అనంతరం విందులో పాల్గొన్నారు.
ప్రభుత్వ జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో..
స్థానిక ప్రభుత్వ జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో 2005–06 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను పాఠశాల నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగించిన అనంతరం వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు సెల్ఫీలు తీసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు.కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు బాలమురళీకృష్ణ, సీతారామిరెడ్డి, ఎర్రిస్వామి, కృష్ణమూర్తి, నాగరాజు, శ్రీనివాసులు, శశికళ, రేణుక, రాజేష్, గిరిధర్,నాగరాజులను ఘనంగా సత్కరించారు.


