విడపనకల్లు: ఈతకు వెళ్లిన వ్యక్తి మృత్యు ఒడికి చేరుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. విడపనకల్లుకు చెందిన బోయ ఓబులేసు(50) హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం పని ముగించుకుని, గ్రామ శివారులోని గౌరమ్మ బావిలోకి ఈతకు వెళ్లాడు. అప్పటికే పలువురు యువకులు అక్కడ సరదాగా ఈత కొడుతుండగా వారిని చూస్తూ తాను కూడా పై నుంచి బావిలోకి దూకాడు. ఆ సమయంలో నీటమునగడంతో యువకులు వెంటనే వెలికి తీసి, స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఓబులేసు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఓబులేసు మృతి విషయం తెలుసుకున్న కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బోయ వెంకటేశులు శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓబులేసు మృతదేహం వద్ద నివాళులర్పించారు.


