అసలే వేసవి. ఎండలు మండుతున్నాయి.. తరచూ విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కరెంటు స్తంభాలు, తీగల నుంచి అగ్గిరవ్వలుపడి, మంటలు ఎగసి.. పంటలు కాలిపోయే అవకాశం ఉంది. గార్లదిన్నె నుంచి పెనకచెర్ల డ్యాంకు వెళ్లే మార్గంలో పొలాలు, పండ్ల తోటల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు అల్లుకున్న తీగలు ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. విద్యుత్ సిబ్బంది, అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగలను తొలగించి, ప్రమాదాలను తప్పించాలని రైతులు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


