బుక్కరాయసముద్రం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన వడ్డే సాయికుమార్ (25) వడియంపేట వద్ద ఉన్న హెచ్‌పీ గ్యాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. శనివారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన సాయికుమార్... అనంతపురం శివారున గుత్తి మార్గంలోని అంబాభవానీ గుడి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కార్మికుల ఎదుట సాయికుమార్‌ను ఫ్యాక్టరీ సెక్యూరిటీ సూపర్‌వైజర్ అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ బైక్‌పై వెళుతూ కిందపడి మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. ఘటనపై బీకేఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సాయికుమార్ (ఫైల్)


