
మలి వయసులో ఆసరా
అనంతపురం అర్బన్: సీనియర్ సిటిజన్ కార్డు ఒక్కటి ఉంటే చాటు ప్రభుత్వం నుంచి లభించే చాలా ప్రయోజనాలు అందుతాయి. 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు అర్హులు. కార్డు తీసుకున్నవారికి ఆర్థిక, వైద్య, ప్రయాణ, పన్ను మినహాయింపు వంటి పలు ప్రయోజనాలు చేకూరుతాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్లాన్‌లు ఇస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల్లో సీనియర్ సిటిజన్ కార్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
● రైల్వే, ఆర్‌టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరపై తగ్గింపు ఉంటుంది
● ఐఆర్‌సీటీసీ లేదా టికెట్ బుక్కింగ్ సమయంలో రాయితీ వర్తిస్తుంది.
● విమాన ప్రయాణాల్లోనూ కొన్నిసార్లు రాయితీలు ఉంటాయి.
● బస్సు పాసు తీసుకుంటే నెలవారీ ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి.
● ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
● వైద్య పరీక్షలు, చికిత్సలపై ఆస్పత్రుల్లో రాయితీలు లభిస్తాయి.
● ఔషధాల మీద కొన్ని ఫార్మసీల్లో తగ్గింపు లభిస్తుంది.
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా వైద్యం అందిస్తారు.
● ఈఎస్‌ఐసీ, సీజీహెచ్‌ఎస్ పథకాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.
● తలసేమియా, క్యాన్సర్, వైద్య రీయింబర్స్‌మెంట్ స్కీముల్లో అర్హత.
● ఆదాయ పన్నులో ప్రత్యేక మినహాయింపు ఉంటుంది.
● 2025–26లో రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్నులు చెల్లించనవసరం లేదు.
● 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై అధిక మినహాయింపు ఉంటుంది.
● 80టీటీబీ కింద ఎఫ్‌డీల మీద వడ్డీ ఆదాయానికి రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
● ఫారం 15 హెచ్ ద్వారా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు.
● పన్ను ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు ప్రత్యేక హెల్డ్ డెస్క్‌లు ఉంటాయి.
● రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ సిటిజన్ పోర్టల్ లేదా సర్కారీ సువిధ (https://sarkarisuvidha. online/) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
● ఆమోదం పొందిన తరువాత సీనియర్ సిటిజన్ కార్డును ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.
● సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా నగర, పురపాలక సంఘం కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
● దరఖాస్తు ఫారం, రెండు ఫొటోలు, చిరునామా, వయసు రుజుపు పత్రాలను అధికారులకు అందించాలి.
● ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్
● జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా పాన్‌కార్డ్
● విద్యుత్ బిల్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ
● ఇటీవల తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు
● బ్యాంక్ పాస్‌బుక్
● ఆరోగ్య పత్ర ఏబీహెచ్‌ఏ కార్డు, హెల్త్ ఐడీ.
60 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారికి సీనియర్ సిటిజన్ కార్డు
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
జిల్లా కేంద్రాల్లోనే పొందే అవకాశం
ఆరోగ్య బీమా, వైద్య రాయితీ
దరఖాస్తు ఇలా
అవసరమైన పత్రాలు..
ప్రయాణంలో రాయితీ
పన్ను మినహాయింపు

మలి వయసులో ఆసరా