
అనంతపురం కార్పొరేషన్: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో జేసీఎస్ మండల ఇన్‌చార్జ్‌లు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రీజనల్ కో ఆర్డినేటర్ చల్లా మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలసి రీజనల్ కో ఆర్డినేటర్ జేసీఎస్ మండల ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 రోజుల పాటు జరిగే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జేసీఎస్ మండల ఇన్‌చార్జ్‌లపై ఉందన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మరింత మెరుగ్గా పని చేయాలన్నారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. పైలా నరసింహయ్య మాట్లాడుతూ గృహసారథుల ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ వంద శాతం పూర్తి చేయాలని జేసీఎస్ మండల ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆర్టీసీ జోనల్ ఛైర్‌పర్సన్ మంజుల, జేసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గోపినాథ్ యాదవ్, పార్టీ ఉపాధ్యక్షుడు తిమ్మారెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతా సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్, పార్టీ నగరాధ్యక్షురాలు కృష్ణవేణి పాల్గొన్నారు.
జేసీఎస్ రీజినల్ కో ఆర్డినేటర్
చల్లా మధుసూదన్‌రెడ్డి