
భూ పరిహారం సమస్యపై కలెక్టర్‌కు వివరిస్తున్న దృశ్యం
కణేకల్లు: ప్రజలు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. అర్జీలు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. గడువులోపు పరిష్కరించాలని సూచించారు. బుధవారం కణేకల్లులోని కేసీఎన్‌ఆర్ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన మండల స్థాయి ‘జగనన్నకు చెబుదాం –స్పందన’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ముటేషన్, రోడ్లు, విద్యుత్, ఇంటి పట్టాలు, ఇళ్లు తదితర సమస్యలపై ప్రజల నుంచి 91 అర్జీలు స్వీకరించారు. టీడీపీ హయాంలో హంద్రీ–నీవా కాలువ కోసం భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, కణేకల్లు పీఏసీఎస్ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, కణేకల్లు మండల అగ్రిబోర్డు చైర్మన్ ఆలేరి లక్ష్మీకాంతరెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నాగేపల్లి – తుంబిగనూరు మార్గమధ్యంలో వంకలో పూడికతీత, గరుడచేడు–మీన్లహళ్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ గ్రామాల్లో మురుగు సమస్య తీవ్రంగా ఉందని, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ సంధ్య కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పెనకలపాడు గ్రామానికి చెందిన శనగల వ్యాపారి రైతుల నుంచి సేకరించిన పంటలకు సంబంధించి సొమ్ము ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని సర్పంచు రామాంజనేయులు, ఉప సర్పంచు అనిల్‌కుమార్, పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, సీపీఓ ప్రశాంత్‌కుమార్, పీఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, డీఏఓ ఉమమహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజారావు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, వెటర్నరీ శాఖ జేడీ సుబ్రమణ్యం, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్, ‘స్పందన’ తహసీల్దార్ వాణిశ్రీ, కణేకల్లు తహసీల్దార్ రజాక్‌వలి, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
బొమ్మనహాళ్: అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. బుధవారం బొమ్మనహాళ్ మండలంలో కలెక్టర్ పర్యటించారు. తొలుత శ్రీధరఘట్ట సచివాలయాన్ని తనిఖీ చేశారు. విద్యుత్, ఫ్యాన్లు సక్రమంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు అందించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూముల రీ సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు. రోగులకందుతున్న సేవలు, మందుల నిల్వల గురించి వైద్యాధికారి గీతాభార్గవితో ఆరా తీశారు. అనంతరం మండలంలోని జగనన్న కాలనీల్లో పక్కాగృహాల పురోగతి గురించి హౌసింగ్ ఏఈ గోవర్దన్‌రెడ్డిని ఆరా తీశారు. మొత్తం పది జగనన్న లే అవుట్లలో 375 పక్కాగృహాలు మంజూరయ్యాయన్నారు. ఇందులో 71 బీబీఎల్, 131 బీఎల్, 70 ఆర్‌ఎల్ దశలో ఉన్నాయని, నాలుగు గృహాలు పూర్తయ్యాయని ఏఈ కలెక్టర్‌కు వివరించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలో ఈ క్రాప్ నమోదు గురించి ఏఓ సాయికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ నిర్వహణపైనా సమీక్షించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ షకీలాబేగం, ఎస్‌ఐ శివ, ఈఓపీఆర్‌డీ విజయమ్మ, వీఆర్‌ఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి శివన్న పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ గౌతమి ఆదేశం