
బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద శాటిలైట్ తిలోఫియా ఫిష్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటుకు మత్స్యశాఖ అధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 18న మత్స్యశాఖ మంత్రి అప్పల రాజు, కమిషనర్ కన్నబాబును విజయవాడలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ కలిసి పనులు ప్రారంభించేలా చూడాలని విన్నవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పీఏబీఆర్ డ్యాంను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (విజయవాడ) హీరా నాయక్, జిల్లా ఉప సంచాలకురాలు శాంతి మాట్లాడుతూ సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా డైరెక్టర్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్‌ను ఆదేశించారు. పనులు చురుగ్గా చేపట్టడానికి అనుసరించాల్సిన సాంకేతిక విధానాలపై సంయుక్త సంచాలకులు టీబీపీ హెచ్‌ఎల్‌సీ ఇంజినీర్లకు దిశా నిర్దేశం చేశారు. సెంటర్ ఏర్పాటులో జాప్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో రాజీసీఏ, సాంకేతిక ఇంజినీర్లు అప్పల నాయుడు, దీపన్, ఫిషరీస్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, ఈఈ శ్రీనివాసులు, డీఈ గురువయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.