గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

- - Sakshi

గుత్తి: పట్టణంలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న నిరాశ్రయుల భవనం వద్ద మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యక్తి వివరాలు తెలిస్తే సంప్రదించాలని పోలీసులు సూచించారు.

హత్య కేసులో

మరో ఇద్దరి అరెస్టు

పావగడ: వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంద్రబెట్ట సమీపంలో ఈ నెల 13న వెలుగుచూసిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేశారు. వివరాలను వైఎన్‌ హొసకోట రూరల్‌ సీఐ కాంతరెడ్డి విలేకరులకు వెల్లడించారు. పథకం ప్రకారమే హత్యకు పాల్పడ్డారని తెలిపారు. హతుడు రామాంజి, నిందితులు కావేరి, చిట్టెమ్మ, రవి సంఘటన ఘటన జరిగిన రాత్రి మహంతపురం నుంచి వైఎన్‌ హొసకోటకు చేరుకున్నారన్నారు. అక్కడ రామాంజికి పూటుగా మద్యం తాగించి బైకులో ఇంద్రబెట్టకు చేర్చారని తెలిపారు. అనంతరం రవి వైఎన్‌ హొసకోటకు వెళ్లి కావేరి, చిట్టెమ్మను బైకులో ఇంద్రబెట్టకు తీసుకొచ్చాడు. వారి పిల్లల్ని మణి అనే మహిళ వద్ద ఉంచారు. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి మళ్లీ రామాంజికి మద్యం తాగించారు. మత్తులో ఉన్న రామాంజి కాళ్లు, చేతుల్ని భార్య కావేరి, ఆమె చెల్లెలు చిట్టెమ్మ గట్టిగా పట్టుకోగా రవి పదునైన కత్తితో రామాంజి గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా బైకులోని పెట్రోలుతో కాల్చి వేసి నిందితులు పరారయ్యారని సీఐ తెలిపారు.

రైలు ఢీకొని గార్మెంట్స్‌

కార్మికుడి మృతి

రాయదుర్గంటౌన్‌: రైలు ఢీకొని ఓ గార్మెంట్స్‌ కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి రాయదుర్గం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన మేరకు.. పట్టణంలోని చౌడమ్మగుడి ఏరియాలో శ్రీనివాసులు(38), స్రవంతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గార్మెంట్స్‌ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వస్తూ రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో ఆయన కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన రైల్వే పోలీసులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top