
రాప్తాడురూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం జరిగిన ఫిజిక్స్(ఇం.మీ) పరీక్షకు సంబంధించి మూడో ప్రశ్న గందరగోళంగా ఉన్నందున.. సమాధానం రాసినా, రాయకపోయినా రెండు మార్కులు కలపనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిందని ఆర్‌ఐఓ సురేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు.
30న జిల్లా స్థాయి వృషభాల బలప్రదర్శన
రాప్తాడు: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 30న రాప్తాడులో జిల్లా స్థాయి వృషభాల బలప్రదర్శన (రాతి దూలం లాగుడు పోటీలు) ఉంటుందని లక్ష్మీపండమేటి రాయుడు ఆలయ పాలకమండలి సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో విజేతలైన వృషభాల యజమానులకు నగదు పురస్కారాలతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 81069 46853, 94400 88531, 91003 15617లో సంప్రదించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజి రాముడు కోరారు.




