గత ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక పంట మార్పిడి చేయాలని అధికారులు సలహాలు ఇచ్చారు.దీనిలో భాగంగా మొక్కజొన్న సాగు చేపట్టాం.అధికారులు పొలాలకు వచ్చి ఈ–పంట నమోదు కూడా చేశారు.మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు లేవు,స్థానికంగా కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– వేగి మాణిక్యాలరావు, రైతు,మునగపాక
యూరియా కూడా
అందడం లేదు
మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు లేవు.ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ను కేవలం రూ.1600కు కొనుగోలు చేస్తున్నారు.పంట సాగుకు వేలాది రూపాయలు ఖర్చవుతోంది. దీనికి తోడు యూరియా కూడా దళారుల ద్వారా అధిక మొత్తానికి కొనుగోలు చేస్తు న్నాం. సకాలంలో యూరియా అందించకపోవడంతో పంటల సాగులో ఇబ్బందులు పడుతున్నాం.గత ప్రభుత్వ హయాంలో రైతులకు భరోసా ఉండేది.
– ఆడారి సత్యనారాయణ, రైతు,మునగపాక
ప్రతిపాదనలు పంపాం
జల్లా వ్యాప్తంగా 187 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. అనుమతి రాగానే వాటిని ఏర్పాటు చేస్తాం.
– ఆశాదేవి, వ్యవసాయశాఖ
జాయింట్ డైరెక్టర్


