శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
నక్కపల్లి: శత శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో విద్యార్ధులకు విద్యాబోధన చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. మంగళవారం సాయంత్రం నక్కపల్లి కేజీబీవీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్ధినులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్ధులతో ముచ్చటించారు. అనంతరం వారికి అందిస్తున్న బోధన గూర్చి అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులలో భారీగా వెనుకబడిన విద్యార్ధులను గురించి వారికి ప్రత్యేక శిక్షణ అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధులు కష్టపడి చదవాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్ధులకి అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.


