శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు

Oct 30 2025 7:55 AM | Updated on Oct 30 2025 7:55 AM

శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు

శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు

ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశా ఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. ఆధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్‌ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ సలహా కమిటీ చైర్మన్‌ పట్టాభిరామ్‌ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలను తిరుమలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement