
రాష్ట్ర స్థాయి వుషు పోటీలకు నింజాస్ అకాడమీ క్రీడాకారుల
నర్సీపట్నం: స్టేట్ వుషు చాంపియన్‌షిప్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన నింజాస్ అకాడమీ నుంచి 17 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న సబ్ జూనియర్, సీనియర్ బాయ్స్, గర్ల్స్ రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్‌లో వీరు పాల్గొంటున్నారని కోచ్ ప్రియాంక తెలిపారు. పోటీలకు తరలివెళ్తున్న క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్స్ సుతాపల్లి శ్రీకాంత్, వెలగా నారాయణరావు, ఎన్‌ఆర్‌ఐ అల్లాడ సురేష్, సీనియర్ కోచ్ యర్రా శేఖర్ అభినందించారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.