
హైదరాబాద్, కాకినాడలకు కొత్త బస్సులు
నర్సీపట్నం: కాకినాడ, హైదరాబాద్‌కు వేసిన కొత్త ఆర్టీసీ బస్సులను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. అనంతరం ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని టాయిలెట్లు, క్యాంటీన్‌ను పరిశీలించారు. శుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్లు శుభ్రం చేసే సిబ్బందికి నెలకు రూ.6 వేల జీతం ఇస్తున్నారని తెలుసుకొని ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వారికి చట్ట ప్రకారం రూ.12 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయమై ఆర్టీసీ చైర్మన్, ఎండీకి లెటర్ పెడతానన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో 58 దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి నెలా అద్దె రూపేణా రూ.7.90 లక్షల ఆదాయం వస్తుందన్నారు. వచ్చే ఆదాయంతో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ప్రజారవాణాధికారి పద్మావతి, డిపో మేనేజర్ ధీరజ్‌ను ఆదేశించారు.
రీజనల్ చైర్మన్ ఏం చేస్తున్నారు?
రీజినల్ చైర్మన్‌గా దొన్ను దొరకు సీఎం చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారని, ఆయన సక్రమంగా విధులు నిర్వహించాలని స్పీకర్ అన్నారు. రీజినల్ చైర్మన్ కనీసం రెండు నెలలకొకసారైనా డిపోలను సందర్శిస్తే ఇటువంటి సమస్యలు తెలుస్తాయన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దొర ఇప్పటి వరకు నర్సీపట్నం, అనకాపల్లి డిపోలను సందర్శించిన సందర్భాలు లేవన్నారు. కార్యాలయంలో కూర్చొని పరిపాలన చేయడం కాదని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.రాజేష్, పార్టీ నాయకులు ఉన్నారు.
నర్సీపట్నం నుంచి నడపనున్న ఆర్టీసీ
జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు