
వీర జవాన్ మృతికి ఉపాధి కూలీల నివాళి
నాతవరం: ఆపరేషన్ సిందూర్‌లో జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందడం పట్ల ఉపాధి కూలీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు నాతవరం మండలం డి.యర్రవరం పంచాయతీలో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వీర జవాన్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇ.సత్యవతి, నల్లగొండమ్మ తల్లి ఆలయ నిర్మాణ దాత చింతంరెడ్డి బెన్నయ్యనాయుడు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అంకంరెడ్డి రామకృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.