
హెచ్‌ఎస్‌ఎల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్‌యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్‌ఎస్‌ఎల్‌కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు.