దేశం కోసం.. | - | Sakshi
Sakshi News home page

దేశం కోసం..

May 10 2025 7:56 AM | Updated on May 10 2025 7:59 AM

దేశం

దేశం కోసం..

● యుద్ధ భూమిలో తండ్రీ కొడుకుల సేవలు ● ఇద్దరూ పాకిస్తాన్‌పై పోరాడినవారే..

మిలటరీ అప్పారావు

గ్గాల అప్పారావును అందరూ మిలటరీ అప్పారావు అని పిలుస్తారు. 1965లో ఆర్మీలో చేరిన వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చింది. 22 సంవత్సరాలు సేవలందించిన ఆయన 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మద్రాస్‌ రెజిమెంట్‌ సెవెంత్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహించి శత్రువులను తరిమికొట్టారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు..

ప్రస్తుతమున్న టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా దేశంపై ఉన్న మక్కువతో ప్రాణాలు తెగించి పోరాడాం. కళ్ల ముందే తోటి సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా అధైర్యపడకుండా ముందుకు దూసుకుపోయేవాళ్లం. ఎక్కువగా ల్యాండ్‌మైన్స్‌ ఏర్పరచడంతో యుద్ధం సమయంలో 40 మంది జవాన్లకు అప్పట్లో కేవలం 10మంది మాత్రమే తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేవారు. యుద్ధాలు జరగడం వల్ల దేశాలు ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోతాయి. అమాయక దేశ పౌరులపై కాల్పులు జరిపి పాక్‌ కయ్యానికి కాలు దువ్వుతోంది. దేశ సంరక్షణ కోసం ప్రస్తుతం ఎనిమిది పదుల వయస్సులో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను.

ఎర్రవరం గ్రామానికి చెందిన అగ్గాల అప్పారావు.. ఆయన కుమారుడు హనుమంతరావు.. ఇద్దరూ ఆర్మీలో సేవలందించారు. పాక్‌ సైనికులను ఎదుర్కొన్నారు. మళ్లీ యుద్ధానికి సిద్ధమంటున్నారు. – అచ్యుతాపురం రూరల్‌

గ్గాల అప్పారావు తనయుడు హనుమంతరావు కూడా అదే మద్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేసి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు. 74 రోజులపాటు పాకిస్తాన్‌తో పోరాడారు. యుద్ధభూమిలో అడుగు పెడితే దేశమే గానీ కుటుంబం గుర్తుకు రాదని, ప్రాణాలు పణంగా పెట్టడానికై నా సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. తన జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకున్నారు..

1999 కార్గిల్‌ యుద్ధంలో పనిచేస్తునప్పుడు సోలార్‌ మిసైల్స్‌ ఉండేవి. వాటిపై ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో ఆటోమెటిక్‌గా టార్గెట్‌ చేసిన స్థలానికి చేరుకుని పేలిపోయేవి. మేము ముందుగానే గ్రహించి యుద్ధం సమయంలో అతి చాకచక్యంగా అటువంటి ఎన్నో సోలార్‌ మిసైల్స్‌ను వెలికితీశాం. ఇంటెలిజెన్స్‌ ప్రతి సైనికునిపై నిఘా ఉంచుతుంది. సైనికుల విధి విధానాలపై అప్రమత్తత వహిస్తుంది. అచ్యుతాపురం మండలం నుంచి సుమారు 30 మంది మాజీ సైనికులం యుద్ధంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని పై అధికారులకు లేఖ పంపించాం.

కార్గిల్‌ యుద్ధ భూమిలో దాచిపెట్టిన సోలార్‌ మిసైళ్లను వెలికి తీసిన అగ్గాల హనుమంతరావు బృందం

దేశం కోసం.. 1
1/2

దేశం కోసం..

దేశం కోసం.. 2
2/2

దేశం కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement