
ముగిసిన వేంకటాద్రి బ్రహ్మోత్సవాలు
పెందుర్తి: వేంకటాద్రిపై కొలువైన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆఖరి రోజు శుక్రవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానం జరిపారు. సాయంత్రం దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం జరిపారు. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలతో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఆలయ అర్చకుడు మహర్తి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఈవో నీలిమ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ముగిసిన వేంకటాద్రి బ్రహ్మోత్సవాలు