చెరువు..బరువు | - | Sakshi
Sakshi News home page

చెరువు..బరువు

May 10 2025 7:56 AM | Updated on May 10 2025 7:59 AM

చెరువ

చెరువు..బరువు

కుంటుపడిన రైతు బతుకు తెరువు

సాక్షి, అనకాపల్లి: మనవి దాదాపు వర్షాధార భూములు. వానలు పడితేనే పంట పండుతుంది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. తగిన నీటి సదుపాయం ఉంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగేలా చెరువుల అభివృద్ధి, ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. సాగునీటి ఇబ్బందులు తొలగించడానికి ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) తీసుకొచ్చింది. ప్రపంచబ్యాంక్‌ 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు భరించేలా సంయుక్తంగా చెరువుల నిర్మాణం చేపట్టారు. ఇందులో స్వతంత్ర, గొలుసుకట్టు చెరువులు, వంద ఎకరాలకుపైగా ఉన్న పెద్ద చెరువులు, చిన్న చెరువుల నిర్మాణ పనులు ఉన్నాయి. అందులో భాగంగానే జిల్లాలో 98 చెరువులు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

ఐదు విభాగాల సహకారం..

వాతావరణంలోని మార్పులను తట్టుకుని వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచే విధంగా రైతులు పంటలను పండించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని విస్తృతం చేశారు. వ్యవసాయ శాఖ, భూగర్భజల శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యావన శాఖ, మత్స్యశాఖ కలిసి సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో చెరువుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 100 ఎకరాల నుంచి 150 ఎకరాలకు సరిపడా నీరు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా చెరువులను అభివృద్ధి చేస్తారు. నీటి లభ్యతను రైతులు అంచనా వేసుకోవడానికి, బోరుబావులలో నీరు సమృద్ధిగా ఉండేటట్లు ఈ పథకంలో చర్యలు తీసుకుంటారు. పిజో మీటర్‌ డ్రిల్లింగ్‌ చేసి నీటి సాంద్రతను నెల నెలా తెలుసుకోవచ్చు.

వర్షపు నీటిని ఒడిసి పట్టి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవాలి. చెరువు ఆయకట్టు శివారు పంట పొలాలకు సైతం సాగునీరు అందేలా చెరువులను అభివృద్ధి, ఆధునికీకరణ చేసుకోవాలి. అప్పుడే పల్లెల్లో చెరువులు సైతం వ్యవ‘సాయం’గా మారుతాయి. ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సాయంతో ‘ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం’లో భాగంగా చెరువుల అభివృద్ధికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేయాలని శరవేగంగా పనులు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ పనులు మందగించాయి. వేసవి కాలంలోనే చెరువులను అభివృద్ధి చేస్తే వచ్చే వర్షాకాలంలో సాగుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత సర్కారు ఆ దిశగా ఆలోచించడం లేదు.

కూటమి ప్రభుత్వంలో చెరువుల ఆధునికీకరణకు గ్రహణం

సమీకృత వ్యవసాయ పరివర్తన పథకం ప్రవేశపెట్టిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

జిల్లాలో 50 సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలన్నది నాటి ప్రతిపాదన

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో

ఆధునికీకరణకు నోచుకోని వైనం

రూ.33.46 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నిర్మాణ పనులు

ఇవి పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు

చెరువుల ద్వారా వ్యవ‘సాయం’

గ్రామాలలో వ్యవసాయానికి తోడ్పాటు అందించేవి చెరువులే. వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు గ్రామాల్లో చెరువులు ఉపయోగపడతాయి. ఈ చెరువుల అభివృద్ధి, నిర్మాణ పనులతో పంటల దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయనికి నీరందించే బోరు బావులలో వేసవి సమయాల్లో నీరు అడుగంటకుండా సహాయపడుతుంది. భూగర్భజలాలను నిల్వ చేయడానికి, వాటితోపాటు చేపల పెంపకానికి దోహదపడుతుంది. మరింత ఆదాయవనరులను పెంచుతుంది. ప్రధానంగా వ్యవసాయ సాగునీటి విస్తీర్ణం పెంచుకోవచ్చు. 20 శాతం కన్నా పనులు తక్కువైన చెరువుల వివరాలు ప్రభుత్వానికి పంపాం.

– రాజేశ్వరరావు, ఈఈ,

భూగర్భ జలవనరుల శాఖ

‘కూటమి’ నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 50 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సహాయంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 80:20 నిష్పత్తిలో పనులు చేపట్టింది. వీటి కోసం రూ.33.46 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 33 చెరువులకు గానూ రూ.20.84 కోట్లతో ఒప్పందాలు ఖరారయ్యాయి. పనులు ప్రారంభమయ్యాయి. మరో 17 చెరువులకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ టెండర్లు రద్దు చేశారు. వీటిలో ఒక్కో చెరువు నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పనులు కొనసాగించకపోగా పలు టెండర్లను రద్దు చేసింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2020లో శ్రీకారం చుట్టారు. అదేవిధంగా జపాన్‌లోని అంతర్జాతీయ సహకార సంస్థ ఆర్థిక సహాయంతో 20 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల అభివృద్ధి కోసం రూ.8.43 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని టెండర్‌ దశలోనే ఉన్నాయి.

చెరువు..బరువు1
1/2

చెరువు..బరువు

చెరువు..బరువు2
2/2

చెరువు..బరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement