
సింహాచలం ఈవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సింహాచలం: చందనోత్సవం నాడు సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన ఘటనలో దేవస్థానం ఈవో కె.సుబ్బారావును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ(విజిలెన్స్) డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దేవస్థానం ఈవోతో పాటు ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్‌ఎన్ మూర్తి, జేఈ కె.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్‌ఆర్ స్వామి, ఏఈ పి.మదన్‌మోహన్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మిగతా ఆరుగురి సస్పెన్షన్ ఆర్డర్లు గురువారం సాయంత్రానికి వచ్చినట్లు చెబుతున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.