
స్నేహితుడి ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్ట్
పెదగంట్యాడ: మండలంలోని దయాల్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీ చేసిన నిందితుడు కాంబలి దిలీప్‌ను న్యూపోర్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హార్బర్ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు గురువారం న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాల్‌నగర్‌కు చెందిన బేర రాజు ఈ నెల 4న తన కుటుంబంతో కలిసి స్వగ్రామమైన పాడేరు మండలం సలుగు వెళ్లారు. రాజు కుటుంబం ఊరిలో లేని విషయాన్ని అతని స్నేహితుడైన కంచరపాలెం బర్మా క్యాంప్‌కు చెందిన దిలీప్ తెలుసుకున్నాడు. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో రాజు ఇంటికి చొరబడి, బీరువాలో ఉంచిన బంగారు పుస్తెలతాడు, రెండు చెయిన్లు, ఒక గొలుసు, ఒక బ్రేస్‌లెట్, ఒక చిన్న ఉంగరం, ఒక లాకెట్‌తో పాటు రూ. 20 వేల నగదును దొంగిలించాడు. ఈ నెల 6న తిరిగి వచ్చిన రాజు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం డీసీపీ పర్యవేక్షణలో క్రైం సీఐ జి. శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని సర్వీస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ లక్ష్మణరావు మాట్లాడుతూ, నిందితుడు చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, జల్సాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. నిందితుడిపై గతంలో అనకాపల్లి జిల్లా చీడికాడ, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లలో కూడా చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ అప్పలరాజు చెప్పారు.