
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విస్తృత తనిఖీలు
అల్లిపురం: పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, చావులమదుం, గొల్లలపాలెం ప్రాంతాల్లో టూటౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్ సిబ్బందితో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సుల్లో ప్రయాణికులు బ్యాగులు, సూట్‌కేసులు తనిఖీ చేశారు. గంజాయి, అనుమానాస్పద వెపన్స్, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారేమో అని తనిఖీలు చేపట్టారు. అదే విధంగా టూటౌన్ ఎస్‌ఐలు సింహాచలం, మన్మథరావు తమ సిబ్బందితో కలిసి గొల్లలపాలెం, చావులమదుం జంక్షన్లలో వాహనాలు తనిఖీ చేశారు.