
● మోగిన సైరన్.. దూసుకెళ్లిన యుద్ధ విమానాలు ● బాంబుల మ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో బుధవారం సమర సన్నాహాక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలో పలు చోట్ల యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి? వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశాలను విశదీకరిస్తూ మాక్ డ్రిల్స్ చేపట్టారు. అనుకోని రీతిలో ఉగ్రదాడులు జరిగినా, బాంబులు పేలినా, అగ్ని ప్రమాదాలు వాటిల్లినా ఎలా వ్యవహరించాలనే అంశాలపై రక్షణ దళాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. ఈ మాక్ డ్రిల్‌లో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఎన్‌సీసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, తూర్పు నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్, రైల్వే, విశాఖపట్నం పోర్టు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, వైద్య శాఖ, పలువురు వలంటీర్లు భాగస్వామ్యమయ్యారు.