
పశు వైద్యశాలల్లో ఉచిత గర్భధారణ ఇంజక్షన్లు
అనకాపల్లి: జిల్లాలోని పశు వైద్యశాలల్లో గర్భధారణ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బి.రామ్మోహనరావు, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. గాంధీనగరంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో వారు జిల్లాలోని పశు వైద్యులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లింగనిర్ధారణ వీర్యం పశువైద్యశాలల్లో అందుబాటులో ఉందని, 60 శాతం సబ్సిడీతో పాడి రైతులకు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వేసవి కాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ బి.సౌజన్య, పశువైద్యులు పాల్గొన్నారు.