
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నక్కపల్లి: జాతీయ రహదారిపై వేంపాడు సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ రూరల్ వలస పాకలు గ్రామానికి చెందిన అనుసూరి వెంకట అనిల్(26), పెంకే తేజ మోటారు సైకిల్‌పై విశాఖ వెళ్తుండగా వేంపాడు దాటాక డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అనిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను తుని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. తేజ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.