
మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
బుచ్చెయ్యపేట: మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. గ్రామానికి చెందిన ఐయితరెడ్డి లక్ష్మి బుధవారం చెరుకు కాటా వద్ద గల తన పాన్‌షాపు వద్ద ఉండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లక్ష్మి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ సెలవులో ఉండటంతో రావికమతం ఎస్‌ఐ వర్మ, బుచ్చెయ్యపేట అదనపు ఎస్‌ఐ భాస్కరరావు కాటా దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి విచారణ చేస్తున్నారు. నంబర్ ప్లేటు లేని స్కూటీపై వచ్చిన వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు.