
డీసీఐఎల్ ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగిస్తున్న ఎండీ అండ్ సీఈవో కెప్టెన్ దివాకర్
దొండపర్తి(విశాఖ దక్షిణ): రానున్న కాలంలో డ్రెడ్జింగ్ కార్యకలాపాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) ఆవిర్భవించే దిశగా అడుగులు వేస్తోందని సంస్థ ఎండీ అండ్ సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీఐఎల్ 47వ ఆవిర్భావ దిన వేడుకలను బుధవారం సీతమ్మధారలోని సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ ప్రగతిని వివరించారు. నాలుగు దశాబ్దాలుగా సంస్థ ఉద్యోగులు, అధికారుల కృషి ఫలితంగా డీసీఐఎల్ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక టర్నోవర్‌ను నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం సంస్థ ఉద్యోగులు, వారి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఐఎల్ డైరెక్టర్లు, పలు విభాగాల అధిపతులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.