
● రాములోరి పెళ్లికి ఊరంతా సందడి
జగదభిరాముడికిగుమ్మడి గింజల హారం
అనకాపల్లి
ఇఫ్తార్ (గురు) సహర్ (శుక్ర)
6–13 4–39
నర్పీపట్నం
6–17 4–38
మాకవరపాలెం: శ్రీరామనవమి సందర్భంగా తూటిపాలకు చెందిన మైక్రో రైటర్ రవికుమార్ బూడిద గుమ్మడి గింజలతో హారం రూపొందించాడు. రాముల వారి కోసం 234 గుమ్మడి గింజలతో ఈ హారం తయారు చేసినట్టు రవికుమార్ తెలిపాడు. పది గింజలపై రామ రామ రామ అని రాశాడు.
పెళ్లంటేనే సందడి, కోలాహలం.. అందులో సీతారాముల కల్యాణమంటే ఆ వేడుకకు, వైభోగానికి హద్దు ఉంటుందా.. దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే. అందుకు రావికమతం మండలం కొత్తకోటలోని ఈ చిత్రాలే తార్కాణం. గురువారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే దేవుడి పెళ్లి కోసం ఒకపక్క చలువ పందిళ్లు వేస్తూ.. మరోపక్క పూల దండలు కడుతూ భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు, పిల్లలు సొంతింట్లో కార్యక్రమంలా ఆయా
కార్యక్రమాలలో పాల్గొని సహాయ సహకారాలందిస్తున్నారు. కొత్తకోట, రావికమతం, మరుపాక
తదితర గ్రామాలలో పెండ్లిరాట కార్యక్రమం
వేడుకగా జరిగింది. –రావికమతం
న్యూస్‌రీల్


