
శిల్పారామంలో దండలు పరిశీలిస్తున్న మంత్రి రోజా
● రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా
పీఎం పాలెం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిల్పారామాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఆ శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మధురవాడ సమీపంలోని శిల్పారామంను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ విషయంలో జగనన్న పాలన దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. శిల్పారామంలో సందర్శకుల అభిరుచికి అనుగుణంగా వాటర్ పార్క్ ఏర్పాటు చేశామని, జిమ్ సదుపాయం కల్పించామనన్నారు. గత ఏడాది కంటే శిల్పారామాలను సందదర్శించే వారు 125 శాతం పెరిగారన్నారు. అనంతరం శిల్పారామంలో కొనసాగుతున్న గ్రామీణ హస్తకళా ఉత్పత్తుల స్టాల్‌ను ఆమె పరిశీలించారు. తాటి మొవ్వు ఆకులతో తయారు చేసిన ఆకర్షణీయమైన దండలు, గోగు నారతో తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. అన్ని స్టాల్స్‌లో ఉన్న ఉత్పత్తులను పరిశీలించి కళాకారులను అభినందించారు. ఇటీవల ప్పారంభించిన సిమ్మింగ్ ఫూల్ వాటర్ పార్కును మంత్రి రోజా సందర్శించారు. ఆమెతోపాటు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, రాష్ట్ర శిల్పారామాల ప్రత్యేక అధికారి డి.శ్యామ్ సుందరరెడ్డి, స్థానిక పరిపాలన అధికారి విశ్వనాథ రెడ్డి తదితరులు ఉన్నారు.