
● డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు
యలమంచిలి: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ ఆకాంక్షించారు. మంగళవారం యలమంచిలి స్టేషన్ రోడ్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతి విద్యార్థి పదిలో చక్కటి ప్రతిభ కనబరిచి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుని జీవితంలో రాణించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అనంతరం విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.