
104 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్
దేవరాపల్లి: గ్రామీణ ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. తారువ క్యాంప్ కార్యాలయం వద్ద దేవరాపల్లి, కె.కోటపాడు, మాడుగుల మండలాలకు కేటాయించిన 104 వాహనాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వైద్య సిబ్బంది వాహనాలకు పూజలు జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 104, 108 వాహనాలను ప్రతి మండలానికి కేటాయించి రాష్ట్ర వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. 104 వాహనాల ద్వారా అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్య సేవలను ప్రజలకు, దీర్ధకాలిక వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నారన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ పేరుతో ఇంటింటా అందిస్తున్న వైద్య సేవలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ్త్రశిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్లె అనురాధ, కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, సర్పంచ్‌లు కర్రి సూరినాయుడు, నాగిరెడ్డి శఠారినాయుడు, వైద్యాధికారి సుబ్రహ్మణ్యం, ఎంపీహెచ్‌ఈవో రాజశేఖర్, టీఎస్‌ఎన్ మూర్తి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య, వైద్యం
తుమ్మపాల: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గోపాలపురంలో నాలుగు 104 వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యసేవలు అందించేందుకు 104 సేవలను విస్తృతం చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసిబ్బంది ద్వారా అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 16 కొత్త వాహనాల ద్వారా నేటి నుంచి సేవలు అందుతున్నాయన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో శారదాబాయి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు తిరుపతిరావు, వాణి, పావని, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ
104 వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు,
మంత్రి అమర్‌నాథ్

తారువలో 104 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు